Back

ⓘ బిక్కవోలు. ఈ గ్రామంలో రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని ..




బిక్కవోలు
                                     

ⓘ బిక్కవోలు

ఈ గ్రామంలో రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ ఊరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వర ఆలయం,శ్రీ గోలింగేశ్వర ఆలయం, శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుటవలన ఈ గ్రామాన్ని బిరుదాంకితవోలుగా పిలిచేవారనియూ, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరియొక కథనం.ఇది కేవలం ఐతిహ్యం.నిరాధార కథనం

                                     

1. గణాంక వివరాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4133 ఇళ్లతో, 14278 జనాభాతో 1966 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6999, ఆడవారి సంఖ్య 7279. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2202 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 308. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587530 2001 జనాభా లెక్కల ప్రకారం బిక్కవోలు జనాభా 14.095. ఇందులో మగవారు 49%, ఆడువారు 51%. సగటు అక్షరాస్యత 70%. ఇది దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే మెరుగు. అక్షరాస్యత మగవారిలో 75%, ఆడువారిలో 66%.పురుషుల సంఖ్య 6.928, మహిళల సంఖ్య 7.167, గ్రామంలో నివాస గృహాలు 3.432 ఉన్నాయి.

                                     

2. విద్యా సౌకర్యాలు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల బిక్కవోలులోనే ఉందిశ్రీ ప్రజ్ఞ జూనియర్ కళాశాల., ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ అనపర్తిలోను, ఇంజనీరింగ్ కళాశాల కాకినాడలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల కాకినాడలోను, మేనేజిమెంటు కళాశాల అనపర్తిలోనూ ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొమరిపాలెంలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కాకినాడలోనూ ఉన్నాయి.

                                     

3. వైద్య సౌకర్యం

ప్రభుత్వ వైద్య సౌకర్యం

బిక్కవోలులో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. మూడు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సంచార వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి.బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

గ్రామంలో ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ముగ్గురు, డిగ్రీ లేని డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.

                                     

4. తాగు నీరు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

                                     

5. పారిశుధ్యం

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

                                     

6. ప్రయాణ, ఇతర వసతులు

బిక్కవోలులో రైల్వే స్టేషను, బస్సు స్టేషను, పోస్టాఫీసు, తి.తి.దే.వారి కళ్యాణ మంటపం, ప్రభుత్వ ఆసుపత్రి, మండల ఆఫీసు, అగ్నిమాపక కార్యాలయం, టెలిఫోను ఆఫీసు, బ్యాంకులు, ఆలయాలు, రైసు మిల్లులు, పాఠశాలలు, పెట్రోలు పంపులు వంటి పలు వసతులున్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది.పాసింజరు రైళ్ళు ఆగుతాయి.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి. రాజమండ్రి నుండి 39 కి.మీ., కాకినాడ 31 కి.మీ. నుండి బిక్కవోలుకు తరచు బస్సు సౌకర్యం ఉంది. బిక్కవోలుకు దగ్గరగా 35కి.మి. దూరంలో మధురపూడి విమానాశ్రయం ఉంది. బిక్కవోలుకు 10కి.మీ. దూరంలో సామర్లకోట రైల్వేజంక్షన్ కలదు ఇక్కడి నుండి విశాఖపట్నం వెళ్ళవలసిన రైళ్ళు, కాకినాడ వెళ్ళవలసిన రైళ్ళు విడిపోతాయి. ఇది దక్షిణమధ్యరైల్వే క్రిందకు వస్తుంది



                                     

7. మార్కెటింగు, బ్యాంకింగు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

                                     

8. ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

                                     

9. విద్యుత్తు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

                                     

10. భూమి వినియోగం

బిక్కవోలులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1485 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1534 హెక్టార్లు
  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 432 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 49 హెక్టార్లు
                                     

11. నీటిపారుదల సౌకర్యాలు

బిక్కవోలులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 200 హెక్టార్లు
  • చెరువులు: 214 హెక్టార్లు
  • ఇతర వనరుల ద్వారా: 16 హెక్టార్లు
  • కాలువలు: 1054 హెక్టార్లు
                                     

12. ఉత్పత్తి

బిక్కవోలులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.ఇక్కడ రైతులు వ్యవసాయ రీత్యా నీటికోసం గోదావరి నుండి వస్తున్న కాలువపై ఆధారపడతారు. కానీ వేసవికాలంలో అదికూడా ఎండి పోతే ఊరికి చివర ఉన్న "లింగాలచెరువు" పై ఆధారపడతారు. ఇది వీర్రాజుపేటకు 1కి.మి. దూరంలో ఉంది.

                                     

13. సంస్కృతి

పురాతనమైన, చారిత్రికమైన జైన, శివ ఆలయాలకు, వాటిలోని శిల్పకళా సంపదకు బిక్కవోలును ప్రత్యేకంగా చెప్పుకోవచ్చును.

శ్రీ చంద్రశేఖర స్వామి

శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి.

                                     

13.1. సంస్కృతి శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం

గోలింగేశ్వర స్వామి ఆలయంగర్భగుడిలో శిలలపై చెక్కబడిన రచనలు ముఖ్యమైనవి. గర్భగుడి ద్వారం శాఖలపైన 33 లైనుల శాసనం చెక్కబడి ఉంది. ముఖమంటపంలో తూర్పు చాళుక్యులనాటి రెండు చక్కని శిల్పాలు భద్రపరచబడి ఉన్నాయి. వీటిలో ఒకటి "ఆలింగన చంద్రశేఖర మూర్తి"గా శివపార్వతుల శిల్పం. మరొకటి కూర్చొని ఉన్న గణేశ ప్రతిమ. ఇవి రెండూ శిల్పకళానైపుణ్యానికి ప్రతీకలు. PI.XX and XXI. ఆలయం పైని విమానం ఒడిషా, ఖజురాహోల శైలిని గుర్తు తెస్తుంది.

                                     

13.2. సంస్కృతి శ్రీ రాజరాజ ఆలయం

మూడు ప్రక్కలా ఉన్న గూడు విగ్రహ మందిరంలలో ఒక చోట వినాయకుడు, మరొకదాన్లో నెమలిపై ఆసీనుడైన కార్తికేయుడు, మరొక చోట మహిషాసుర మర్ధనిగా అమ్మవారు, శ్రీరాజరాజేశ్వరీ సమేతులైన శివలింగాకృతి ఉన్నాయి.

                                     

13.3. సంస్కృతి శ్రీ చంద్రశేఖర స్వామి

శివలింగానికి నాలుగు ప్రక్కలా అందమైన చంద్రశేఖరస్వామి, బాల త్రిపురసుందరి శిల్పాలున్నాయి.

                                     

13.4. సంస్కృతి ఏక శిలా గణేశుడు

11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. ఈ ముద్రిక ఇప్పుడుచెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

                                     

13.5. సంస్కృతి 1వ శివాలయం

గ్రామం శివారులలో ఉన్న శివాలయం మిగిలిన శివాలయాలలాగానే మూడు ప్రక్కల గూడులతో, మకర తోరణాలంకరణతో ఉంది. ఈ శిల్పాలలో ఒక నటరాజమూర్తి చతురభంగిమలో ఉన్నాడు. ఇక్కడ కనిపించే మరొక విశేషం - శివుడు లకులీశునిగా చూపబడడం (లకులీశ, లేదా నకులీశ అనేది పాశుపత శైవాన్ని బోధించిన గురువు. శివుని ప్రతిరూపంగా వారిచే ఆరాధింపబడ్డాడు. తూర్పు గాంగుల నాటిదైన ముఖలింగంలో కూడా దక్షిణామూర్తి లకులీశునిగా చూపబడ్డాడు.

                                     

13.6. సంస్కృతి 2వ శివాలయం

పంట పొలాలలో ఉన్న పెద్ద ఆలయం. ద్వారానికిరువైపులా ద్వారపాలకులు, గుమ్మంపైన లక్ష్మీదేవి విగ్రహాలు తప్ప ఈ ఆలయంలో శిల్పాలు లేకుండా సాదాగా ఉంటుంది.ఆలయం విమానం పల్లవుల కాలపు నిర్మాణశైలిని పోలిఉంటుంది.

                                     

13.7. సంస్కృతి 3వ శివాలయం

ఈ ఆలయం ద్వారానికిరువైపులా గంగ, యమున నదీదేవతల విగ్రహాలున్నాయి. మందిరం పై భాగంలో మైధునం వంటి పలు భంగిమలు చెక్కబడి ఉన్నాయి. సూర్య, విష్ణు విగ్రహాలు గోలింగేశ్వర స్వామి ఆలయంలోని విగ్రహాలను పోలి ఉన్నాయి.

                                     

14. ఇతర చారిత్రక విషయములు

బిక్కవోలు ఉన్న జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు 59 సంవత్సరాల చరిత్ర ఉంది. దీనిని 1960 లో నిర్మించారు.ముందు ముందు రాబోయే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు నూతన భవనాలను నిర్మించారు. ఇదే పాఠశాలలో చదువుకొని ఎంతో మంది ఉన్నత పదవులలో ఉన్నారు. ఉదాహరణకు డా.తోటకూర పోతరాజు గారు.సామర్యలకోట మండల జెడ్.పి.టి.సి గా పనిచేసిన వీరు బిక్కవోలు గ్రామ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు కొనియాడ దగినవి.