Back

ⓘ బేతియా వాతావరణం అధిక ఉష్ణోగ్రతలతో, వర్షాకాలంలో అధిక అవపాతంతో కూడుకుని ఉంటుంది. ఈ శీతోష్ణస్థితిని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం Cfa తేమతో కూడిన ఉపఉష్ణమ ..




బేతియా
                                     

ⓘ బేతియా

బేతియా వాతావరణం అధిక ఉష్ణోగ్రతలతో, వర్షాకాలంలో అధిక అవపాతంతో కూడుకుని ఉంటుంది. ఈ శీతోష్ణస్థితిని కొప్పెన్ శీతోష్ణస్థితి వర్గీకరణ ప్రకారం Cfa తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణంగా వర్ణిస్తారు.

                                     

1. జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, బేతియా పట్టణ జనాభా 1.32.209. వీరిలో 69.529 మంది పురుషులు, 62.680 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లలు 18.995. బేతియా అక్షరాస్యత 91.298. ఇది జనాభాలో 69.1%, పురుషుల్లో అక్షరాస్యత 72.7%, స్త్రీలలో అక్షరాస్యత 64.9%. బేతియాలో ఏడేళ్ళకు పైబడినవారిలో అక్షరాస్యత 80.6%, ఇందులో పురుషుల అక్షరాస్యత 85.0%, స్త్రీల అక్షరాస్యత 75.8%. షెడ్యూల్డ్ కులాల జనాభా 8.266, షెడ్యూల్డ్ తెగల జనాభా 828. 2011 లో బేతియాలో 24463 గృహాలు ఉన్నాయి.

బేతియా పట్టణ సముదాయంలో బేతియా, తోలా మన్సారౌత్, కర్గాహియా పురబ్, హాత్ సరయ్యా ఉన్నాయి. తోలా శాన్ సరయన్ కొత్త పట్టణాధార గ్రామం. కొత్త గోపాల్‌గంజ్-బేతియా రహదారి ఈ గ్రామం గుండా వెళ్తుంది. ఈ కొత్త రహదారి ద్వారా గోపాల్‌గంజ్-బేతియాల మధ్య దూరం 60 కి.మీ. తగ్గుతుంది.