Back

ⓘ బేతుల్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, బేతుల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. సముద్ర మట్టానికి 658 మీటర్ల ఎత్తున ఉంది. ఈ ప్రాంతం సమృద్ధిగా అడవులతో, జీవవైవిధ్ ..
బేతుల్
                                     

ⓘ బేతుల్

బేతుల్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం, బేతుల్ జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. సముద్ర మట్టానికి 658 మీటర్ల ఎత్తున ఉంది. ఈ ప్రాంతం సమృద్ధిగా అడవులతో, జీవవైవిధ్యంతో ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, సాత్పురా శ్రేణి యొక్క మైదానంలో ఉండడం వలన బేతుల్, ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది రాజధాని నగరం భోపాల్ నుండి 180 కి.మీ దూరంలో ఉంది. బేతుల్ సమీప నగరాలు ఛింద్వారా, నాగపూర్, ఖాండ్వా, హోషంగాబాద్, హర్దా మొదలైనవి.

                                     

1. జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం బేతుల్ జనాభా 103.330. జనాభాలో పురుషులు 51.12%, మహిళలు 48.88%. బేతుల్ సగటు అక్షరాస్యత రేటు 89.28%, ఇది జాతీయ సగటు 74.04% కంటే ఎక్కువ. జనాభాలో 10.82% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

                                     

2. రవాణా సౌకర్యాలు

బేతుల్ భారతీయ రైలు నెట్‌వర్క్ యొక్క ఢిల్లీ-చెన్నై గ్రాండ్ ట్రంక్ మార్గంలో ఉంది. ఇక్కడి నుండి భోపాల్, నాగ్‌పూర్‌ మార్గాల్లో చక్కటి రైలు సౌకర్యాలున్నాయి. బేతుల్ - చందూర్ బజార్, బేతుల్-హర్దా -ఇండోర్.అనే రెండు కొత్త రైల్వే లైన్లు కూడా ప్రతిపాదించబడ్డాయి. బేతుల్ రైల్వే స్టేషన్‌లో 94 రైళ్లు ఆగుతాయి. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, జైపూర్, లక్నో, కాన్పూర్, భోపాల్, ఇండోర్, హర్దా, జబల్పూర్, నాగ్‌పూర్ మొదలైన ప్రదేశాలకు ఇక్కడి నుండి రైళ్ళున్నాయి

బేతుల్‌కు జాతీయ రహదారి 46, జాతీయ రహదారి 47 ద్వారా అనుసంధానం ఉంది. ఇవి పట్టణాన్ని భోపాల్, నాగ్‌పూర్‌తో కలుపుతాయి. జాతీయ రహదారి 47 ద్వారా హర్దా, ఇండోర్ లకు కూడా రవాణా సౌకర్యం ఉంది. భోపాల్, నాగ్‌పూర్, హర్దా, ఇండోర్‌లతో పాటు జబల్‌పూర్, హోషంగాబాద్, తదితర నగరాలకు ఇక్కడి నుండి రోజువారీ బస్సులు ఉన్నాయి. బేతుల్ RTO కోడ్ MP48.