Back

ⓘ బిశ్రామ్‌గంజ్, త్రిపుర రాష్ట్రంలోని సిపాహీజాల జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది రాజధాని అగర్తలా నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2012, జనవరి నెల ..




బిశ్రామ్‌గంజ్
                                     

ⓘ బిశ్రామ్‌గంజ్

బిశ్రామ్‌గంజ్, త్రిపుర రాష్ట్రంలోని సిపాహీజాల జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం. ఇది రాజధాని అగర్తలా నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2012, జనవరి నెలలో సిపాహీజాల జిల్లాగా ఏర్పడిన తరువాత ఇది జిల్లా ముఖ్య పట్టణంగా మార్చబడింది.

                                     

1. చరిత్ర

పూర్వకాలంలో ఒక త్రిపుర రాజు పర్యటన కోసం వెళ్ళినప్పుడు అతను ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేవాడు. దాంతో, అతను ఈ స్థలానికి బిష్రామ్ గంజ్ అని పేరు పెట్టాడు. బిశ్రామ్ అంటే విశ్రాంతి అని, గంజ్ అంటే స్థలం అని అర్థం. ఈ ప్రాంతాన్ని త్రిపురి జాతికి చెందిన డెబ్బార్మా ప్రజలు ఆక్రమించారు. ప్రస్తుతం దేబ్బర్మాలను త్రిపుర ప్రధాన తెగగా పిలుస్తున్నారు.

                                     

2. భౌగోళికం

ఈ పట్టణం 23.60°N 91.34°E  / 23.60; 91.34 అక్షాంశరేఖాల మధ్య ఉంది. ఇది సముద్రమట్టానికి 15 మీటర్లు 49 అడుగుల ఎత్తులో ఉంది. అగర్తాలా నగరానికి తూర్పు వైపు 5 కి.మీ.ల దూరంలో, బిషాల్‌గర్ నుండి 22 కి.మీ.ల దూరంలో ఈ పట్టణం ఉంది. ఇందిరానగర్ 1 కి.మీ., ఉత్తర చంపమురా 1 కి.మీ., మరియంనగర్ 1 కి.మీ., ఖైర్‌పూర్ 1 కి.మీ., తూర్పు చంపమురా 1 కి.మీ. మొదలైన గ్రామాలు బిశ్రామ్‌గంజ్ కు సమీపంలో ఉన్నాయి.