Back

ⓘ బైరామల్‌గూడ. ఇక్కడ అనేక వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు ఉన్నాయి. శ్రీ నిలయం గార్డెన్స్, గజ్జల జంగారెడ్డి గార్డెన్స్, పిండి పుల్లారెడ్డి గార్డెన్స్, ఈదులకంటి రాంరె ..
బైరామల్‌గూడ
                                     

ⓘ బైరామల్‌గూడ

ఇక్కడ అనేక వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు ఉన్నాయి. శ్రీ నిలయం గార్డెన్స్, గజ్జల జంగారెడ్డి గార్డెన్స్, పిండి పుల్లారెడ్డి గార్డెన్స్, ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్, కెకెకె గార్డెన్స్ వంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి.

                                     

1. రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బైరమల్‌గూడకు బస్సులు 104ఆర్, 277, 293, 93 మొదలైనవి నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో మలక్ పేట హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్. రైలు స్టేషను, ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను ఉన్నాయి.

సికింద్రాబాదు నుండి ఓవైసీ రోడ్డు, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు మార్గాలకు సులువుగా వెళ్ళేందుకు బైరామల్‌గూడ జంక్షన్ దగ్గర స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఎస్ఆర్డీపీ ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా 26.45 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులో నిర్మించిన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కుడివైపు నిర్మించబడింది. 2020, ఆగస్టు 11న తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.

                                     

2. ఇతర వివరాలు

  • ఇక్కడికి సమీపంలో 400 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ఉంది.
  • ఇక్కడ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్, తిరుమల హాస్పిటల్ ఉన్నాయి.