Back

ⓘ బులంద్‌షహర్‌. బులంద్‌షహర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం, బులంద్‌షహర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం జాతీయ రాజధా ..
బులంద్‌షహర్‌
                                     

ⓘ బులంద్‌షహర్‌

బులంద్‌షహర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం, బులంద్‌షహర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. ఈ నగరం జాతీయ రాజధాని ప్రాంతం లో భాగం. 2011 జనగణన నాటి సామాజిక-ఆర్థిక సూచికలు, ప్రాథమిక సౌకర్యాల సూచికల ఆధారంగా, బులంద్‌షహర్ మైనారిటీ మతస్థులు ఎక్కువగా ఉన్న జిల్లా అని భారత ప్రభుత్వం ప్రకటించింది. బులంద్‌షహర్ ఢిల్లీ నుండి 68 కి.మీ.దూరంలో ఉంది.

                                     

1. చరిత్ర

అహిబరన్ అనే రాజు ఇక్కడ బరన్ అనే కోటకు పునాది వేసి తన రాజధాని బరన్‌షహర్ స్థాపించాడని చెబుతారు. దీనిని బరన్ షహర్ అనేవారు. అధికారిక ఉపయోగాలలో ఈ పేరు బులంద్‌షహర్ గా మారింది. అది ఒక మెరక ప్రదేశంపై ఉండేది.అంచేత దీన్ని "ఉన్నత నగరం" అనేవారు. పెర్షియన్ భాషలో దీని అర్థం బులంద్‌షహర్. ప్రస్తుతం అప్పర్ కోర్ట్ అనే స్థలం ఉంది. ఇది రాజా అహిబరన్ కోట అని నమ్ముతారు. పాత బరన్ ఈ ప్రాంతానికి పరిమితం చేయబడింది. బహుశా 12 వ శతాబ్దంలో బరన్ రాజ్యం ముగిసింది. క్రీ.శ 1192 లో, ముహమ్మద్ గౌరీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను జయించినప్పుడు, అతని జనరల్ కుతుబుద్దీన్ ఐబాక్ బరన్‌ కోటను చుట్టుముట్టి దానిని జయించాడు. రాజా చంద్రసేన్ దోడియాను చంపేసి ఐబాక్, బరన్ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

భటోరా వీర్‌పూర్, గాలిబ్‌పూర్ మొదలైన ప్రదేశాలలో లభించిన పురాతన శిథిలాలు బులంద్‌షహర్ ప్రాచీనతను సూచిస్తున్నాయి. జిల్లాలో అనేక ఇతర ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి, ఇక్కడ మధ్యయుగానికి చెందిన విగ్రహాలు, పురాతన దేవాలయాల వస్తువులను కనుగొన్నారు. ఈ పురాతన నాణేలు, శాసనాలు మొదలైన వాటిని లక్నో లోని స్టేట్ మ్యూజియంలో భద్రపరచారు.

                                     

2. జనాభా

2011 జనాభా లెక్కల ప్రకారం, బులంద్‌షహర్ పట్టణ సముదాయం జనాభా 2.35.310. ఇందులో పురుషులు 1.25.549, మహిళలు 1.11.761. ఆరేళ్ళ లోపు పిల్లలు 30.886. మొత్తం అక్షరాస్యుల సంఖ్య 1.60.203, వీరిలో 90.761 మంది పురుషులు, 69.442 మంది మహిళలు. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 78.37%.

  • సతీష్ కుమార్, 2014 ఆసియా క్రీడల బాక్సర్ పతక విజేత.
  • సోనాల్ చౌహాన్, బాలీవుడ్ నటి
  • ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రచయిత, మాజీ క్యాబినెట్ మంత్రి
  • భారత క్రికెట్ జట్టులో ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.
  • బయోఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త గజేంద్ర పాల్ సింగ్ రాఘవ, సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతితో సహా అవార్డుల విజేత
  • జైప్రకాష్ గౌర్, జైప్రకాష్ అసోసియేట్స్, జేపీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్
  • బనారసీ దాస్ 1912-1985, భారత రాజకీయవేత్త, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి