Back

ⓘ బుద్గాం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగంలో బుద్గాం ఒక జిల్లా కేంద్రం. బుద్గాం జిల్లాలో ఇది నగర పంచాయితీ హోదా కలిగిన ఒక పట్టణం. బుద్గాం నగరాన్ని 14 వార్ ..
బుద్గాం
                                     

ⓘ బుద్గాం

బుద్గాం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ కేంద్ర భూభాగంలో బుద్గాం ఒక జిల్లా కేంద్రం. బుద్గాం జిల్లాలో ఇది నగర పంచాయితీ హోదా కలిగిన ఒక పట్టణం. బుద్గాం నగరాన్ని 14 వార్డులుగా విభజించారు, వీటికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.

                                     

1.1. జనాభా 2011 గణాంకలు

2011 భారత జనాభా లెక్కలు ఆధారం ప్రకారం బుద్గాం పట్టణ జనాభా 15.338, ఇందులో 9.003 మంది పురుషులు, 6.335 మంది మహిళలు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు లోపు గల పిల్లల జనాభా 1335, ఇది బుద్గాం ఎంసి మొత్తం జనాభాలో 8.70%.గా ఉంది. లింగ నిష్పత్తి రాష్ట్ర సగటు 889 కు వ్యతిరేకంగా 704 గా ఉంది. అంతేకాకుండా, జమ్మూ కాశ్మీరు రాష్ట్ర సగటు 862 తో పోలిస్తే బుద్గాంలో బాలల లైంగిక నిష్పత్తి 963 గా ఉంది. బుద్గాం నగర అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.16%గా ఉంది. పురుషుల అక్షరాస్యత 84.33% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 56.44%.పట్టణ పరిధిలో మొత్తం 2.258 ఇళ్లు కలిగి ఉన్నాయి, దీనికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను పురపాలక కౌన్సిల్ అందిస్తుంది. మున్సిపల్ కమిటీ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా అధికారం ఉంది.

                                     

1.2. జనాభా 2001 గణాంకాలు

2001 భారత జనాభా లెక్కల ప్రకారం బుద్గాం మొత్తం జనాభా 15.932.అందులో పురుషులు 69%, మంది ఉండగా, స్త్రీలు 31% మంది ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 68%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; 81% మంది పురుషులు 19% మంది మహిళలు అక్షరాస్యులు. జనాభాలో 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు 6% మంది ఉన్నారు.బుద్గాం జిల్లాలోని ముస్లిం జనాభాలో 25℅ మంది షియా వర్గానికి చెందినవారు.

                                     

2. రవాణా సౌకర్యాలు

రోడ్డు మార్గం

బుద్గాం జాతీయ రహదారి 444 తో భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంది.

రైల్వే స్టేషన్లు

బుద్గాంకు జమ్మూ- బారాముల్లా, మఝోం రైల్వే స్టేషను అనే రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.