Back

ⓘ బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను అనేది బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని కర్నాటకలోని బైయప్పనహళ్ళిలో ఉన్న ఒక భారతీయ రైల్వే స్ ..




బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను
                                     

ⓘ బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను

బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను అనేది బెంగుళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోని కర్నాటకలోని బైయప్పనహళ్ళిలో ఉన్న ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది బైయప్పనహళ్ళి, కృష్ణరాజపురం ప్రాంతానికి సేవలు అందిస్తుంది.

                                     

1. అభివృద్ధి

బెంగుళూరు నగర రైల్వే స్టేషను చుట్టూ ఖాళీ స్థలం లేనందున, నగరంలో తూర్పు భాగంలో ఉన్న బైయప్పనహళ్ళి 2008 లో అన్ని రకాల సౌకర్యాలతో నగరానికి మూడవ రైల్వే టెర్మినల్గా దక్షిణ పశ్చిమ రైల్వే SWR ఈ రైల్వే స్టేషనును అభివృద్ధి చేసింది.

                                     

2. నిర్మాణం & విస్తరణ

బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను రెండు ప్లాట్‌ఫారములు కలిగి ఉంది. ఈ స్టేషను నాలుగు రైలు మార్గముల ట్రాక్ కలిగి ఉండి, ఒక్కొక్కటి 400 మీ. పొడవు ఉంటుంది. ప్రతి ప్లాట్‌ఫారం నందు షెల్టర్లు,బెంచీలు, బుకింగ్ ఆఫీసు, పార్కింగ్, స్కైవే, టాయిలెట్ సదుపాయములు బైయప్పనహళ్ళి రైల్వే స్టేషను నందు ఉన్నాయి.