Back

ⓘ బేగంబజార్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. కుతుబ్ షాహీ కాలంలో ఏర్పడిన ఈ బేగంబజార్ నగరంలోని ప్రముఖ వ్యాపారకేంద్రాల్లో ఒకటిగా విరసిల్లుతుంది. ఓల్ ..
బేగంబజార్
                                     

ⓘ బేగంబజార్

బేగంబజార్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. కుతుబ్ షాహీ కాలంలో ఏర్పడిన ఈ బేగంబజార్ నగరంలోని ప్రముఖ వ్యాపారకేంద్రాల్లో ఒకటిగా విరసిల్లుతుంది. ఓల్డ్ సిటీలోని నయాపుల్ వంతెనకు అరకిలోమీటర్ దూరంలో ఉన్న ఈ బేగంబజార్ లో గృహోపకరణాలకు సంబంధించిన వస్తువుల కొరకు ఏర్పాటుచేయబడిన అనేక దుకాణాలు ఉంటాయి. రాగి, ఇత్తడి వస్తువులు కూడా ఇక్కడ లభిస్తాయి. ఇక్కడ ప్రతిరోజు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది.

                                     

1. చరిత్ర

హైదరాబాద్ నిజాం ప్రభువు నిజాం అలీ ఖాన్, అస్సాఫ్ జా-II యొక్క భార్యైన హమ్డా బేగం ఈ ప్రాంతాన్ని వర్తకవ్యాపారాలకోసం హైదరాబాదులోని వ్యాపారులకు బహుమతిగా ఇచ్చింది. ఇక్కడ మార్కెట్ అభివృద్ధి చేసిన తరువాత, ఇది బేగంబజార్ గా పిలువబడుతుంది.

                                     

2. వ్యాపారం

హైదరాబాదు నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే మార్కెట్‌ బేగంబజార్. అన్ని రకాల వస్తువులకు ఇది నెలవైన ఈ ప్రాంతంలో హోల్‌సేల్‌ నుంచి రిటైల్‌ దాకా రోజూ కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. నగరంలోని ఇతర ప్రాంతాలేనుండేకాకుండా వివిధ ప్రాంతాల వ్యాపారులు ఒక్కడికి వచ్చి తమకు కావలసిన వస్తువులను తీసుకెలుతుంటారు. బేగంబజార్‌లోని ఏడు డివిజన్ల పరిధిలో సుమారు ఐదువేల హోలోసేల్‌ దుకాణా సముదాయాలున్నాయి. ఇందులో కిరాణా, నగలు, దుస్తులు, స్టీలు, సిమెంటు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసరాలు, టైర్లు, ఎలక్ట్రికల్, పప్పు దినుసులు, మసాలా, డ్రైఫ్రూట్స్, ఆటోమోబైల్స్, నూనెలు, లూబ్రికెంట్స్, పాన్మసాలా, ఫర్టిలైజర్, కాస్మోటిక్స్, స్టెయిన్లెస్‌స్టీల్‌ తదితర రంగాలకు సంబంధించిన దుకాణాలున్నాయి.

                                     

2.1. వ్యాపారం చేపల మార్కెట్‌

హైదరాబాదులోని రెండవ పెద్ద చేపల మార్కెట్ ఇక్కడవుంది. చేపల అమ్మకాలు, ప్రాసెసింగ్‌ను నిర్వహించడంకోసం అత్యాధునికంగా రూ.5.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న చేపల మార్కెట్ కు 2018, జనవరి 24న తెలంగాణ రాష్ట్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. జాతీయ మత్య్స అభివృద్ధి సంస్థ రెండున్నర కోట్లు, మిగిలిన మూడు కోట్ల రూపా యలను జీహెచ్‌ఎంసీ వెచ్చించనుంది. సెల్లార్‌లో పార్కింగ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో హోల్‌సేల్ దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్, మొదటి అంతస్తులో చేపల కట్టింగ్, రిటైల్ వ్యాపారాల నిమిత్తం నిర్మాణాలు చేపట్టనున్నారు.

                                     

3. రవాణా

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బేగంబజార్ నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో అఫ్జల్‌గంజ్ బస్టాండ్, మలక్‌పేట రైల్వే స్టేషను, నాంపల్లి రైల్వే స్టేషనులు ఉన్నాయి.