Back

ⓘ బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను. బెంగళూరు కంటోన్మెంటు అనేది కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు నందలి వాసంతి నగర్ ప్రాంతంలో గల రైల్వేస్టేషను. యిది బెంగళూరు లోని ..




బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను
                                     

ⓘ బెంగళూరు కంటోన్మెంటు రైల్వేస్టేషను

బెంగళూరు కంటోన్మెంటు అనేది కర్ణాటక రాజధాని నగరమైన బెంగళూరు నందలి వాసంతి నగర్ ప్రాంతంలో గల రైల్వేస్టేషను. యిది బెంగళూరు లోని ముఖ్యమైన రైల్వే స్టేషనులలో ఒకటి. ఇది వసంత నగర్, శివాజీ నగర్ తదితర ప్రాంతములకు దగ్గరగా నుండును. ఇచట మూడు ప్లాట్ ఫారములు గలవు. ఇది సముద్ర మట్టమునకు 929 మీటర్ల ఎత్తులో గలదు. ఈ స్టేషను యొక్క కోడ్: BNC

                                     

1. సౌకర్యములు

ఇచ్చట ప్రయాణీకుల రిజర్వేషన్ కేంద్రము కలదు. విశ్రాంతి గదులు, ఎ.సి. వి.ఐ.పి లాంజ్, విచారణ కేంద్రములు, భోజనశాలలు, ఏ.టి.ఎం వంటి సౌకర్యములు కలవు. అత్యవసర వైద్య చికిత్స అందించుటకు 2014 ఫిబ్రవరి లో ఒక క్లినిక్ ఏర్పరచబడెను. సరకులను త్రోయు త్రోపుడు బండ్లకు వీలగునట్లు ప్లాట్ ఫారములు నిర్మింపబడెను.

దక్షిణ భారత దేశపు మొట్టమొదటి రెండంతస్తుల రైలు డబుల్ డెక్కర్ ఈ స్టేషను మీదుగా చెన్నై-బెంగుళూరు నడుమ ప్రయాణించును.

                                     

2. Expansion

జనవరి 2011 లో ఆధునీకరించబడిన ప్రవేశ ద్వారము, టిక్కెట్ విక్రయశాలను అప్పటి కేంద్ర రైల్వే శాఖా సహాయ మంత్రి మునియప్ప ప్రారంభించారు. Bangalore cantonment station got a face lift with the remodelled entrance and ticketing counter behind the platform 2 which was opened to public on January 2011 by K Muniyappa, Union minister of state for railways.

                                     

3. రైళ్ళు

దక్షిణ భారత దేశంలో మొదటి డబుల్ డెక్కర్ ఎ.సి రైలు కు ఈ స్టేషనులో నిలిపే సౌకర్యం కలదు. ఈ క్రింది పట్టికలో ప్రతిరోజూ ఈ స్టేషను నుండి బయలుదేరు రైళ్ళ వివరాలు యివ్వబడ్డాయి.