Back

ⓘ బైలడీలా పర్వత శ్రేణి చత్తీస్‌గఢ్‌లో విస్తరించిన ఒక పర్వత శ్రేణి. దక్కను పీఠభూమికి ఈశాన్యంలో తూర్పు కనుమల నుండి 200 కి, మీ. పశ్చిమంగా ఈ పర్వత శ్రేణి మొదలైంది. ఎద ..




బైలడీలా
                                     

ⓘ బైలడీలా

బైలడీలా పర్వత శ్రేణి చత్తీస్‌గఢ్‌లో విస్తరించిన ఒక పర్వత శ్రేణి. దక్కను పీఠభూమికి ఈశాన్యంలో తూర్పు కనుమల నుండి 200 కి, మీ. పశ్చిమంగా ఈ పర్వత శ్రేణి మొదలైంది. ఎద్దు మూపురం ఆకారంలో ఉండడం చేత దీనికి ఆ పేరు వచ్చింది. దెంతెవాడ జిల్లా లోని కిరండూల్ పట్టణం ఈ పర్వత శ్రేణి ఉంది.

                                     

1. భౌగోళికం

బైలడీలా శ్రేణి దక్కను పీఠభూమిలో నైఋతి నుండి ఈశాన్య దిశగా విస్తరించింది. ఇంద్రావతి నదికి దక్షిణాన 70 కి.మి. పొడవిన ఈ శ్రేణి ఉంది. దెంతెవాడకు 40 కి.మీ. దూరంలో ఈ శ్రేణి ఉంది. ఈ శ్రేణిలో 1.276 మీ. ఎత్తున్న శిఖరం చత్తీస్‌గఢ్లోకెల్లా ఎత్తైన బిందువు. ఒకప్పుడు ఈ కొండలు దట్టమైన అడవులతో నిండి ఉండేవి. కానీ ఇక్కడ లభించే ఇనుప ఖనిజం కోసం పెద్ద యెత్తున గనులు తవ్వడంతో కొండలపై చాలా చోట్ల గాట్లు పడ్డాయి.

బైలడీలా పర్వత శ్రేణులలో 14 చోట్ల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ఈ 14 నిక్షేపాలలో రెండు నిక్షేపాలు కిరండూల్ దగ్గర, ఒక నిక్షేపం బచేలీ దగ్గర ఉన్నాయి. కిరండూల్ ‍ & బచేలీ ఇనుప గనుల నుంచి విశాఖపట్నం ఓడరేవుకి రైలు మార్గం ద్వారా ఇనుప ఖనిజం రవాణా అవుతోంది.